చాలా సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా చంద్రముఖి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రజనీ కాంత్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని నయన తార హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ లో ప్రభు , జ్యోతిక కీలక పాత్రలలో నటించారు. వడివేలు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఆ సమయంలో ఈ సినిమా అటు తమిళ ... ఇటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి పి వాసు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది.

ఇకపోతే ఈ సినిమా వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత చంద్రముఖి మూవీ దర్శకుడు అయినటువంటి పి వాసు ఈ సినిమాకు కొనసాగింపుగా చంద్రముఖి 2 అనే మూవీ ని రాఘవ లారెన్స్ హీరోగా రూపొందించాడు. ఈ మూవీ.లో కంగనా రానౌత్ హీరోయిన్ గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడిన సందర్భంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ...

అసలు విషయం లోకి వెళితే ... చంద్రముఖి మూవీ మొత్తం చాలా బాగున్నప్పటికీ లాస్ట్ అర్ధ గంట మాత్రం అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది. ఇకపోతే చంద్రముఖి 2 సినిమాలో కూడా ఆఖరి అర్థ గంట అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అర్థ గంట తోనే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఓ టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: