సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎప్పుడు కూడా తమ ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇలా హీరోలు ఫిట్ గా ఉంటేనే వారికి తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి.అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు మనుగడ సాగించాలి అంటే తప్పనిసరిగా ఫిట్నెస్ అవసరం కనుక ఎంతో మంది హీరో హీరోయిన్లు పెద్ద ఎత్తున జిమ్ సెంటర్లకు వెళుతూ ఫిట్నెస్ పై దృష్టి పెడుతూ ఉంటారు. ఇక ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా స్ట్రిక్ట్ అనే విషయం మనకు తెలిసిందే.

 ప్రస్తుతం చిరంజీవి ఆరుపదుల వయసు దాటుతూ ఉన్నప్పటికీ ఇంకా హీరో గానే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇక చిరంజీవి రామ్ చరణ్ పక్కపక్కనగా ఉంటే తండ్రి కొడుకులుగా కాకుండా అన్నదమ్ములు మాదిరిగా ఉంటారు. ఇప్పటికి చిరంజీవి అలా యంగ్ గా ఫిట్ గా కనిపిస్తున్నారు అంటే ఆయన తన ఫిట్నెస్ పై పెట్టే శ్రద్ధ అని మాత్రమే చెప్పాలి .ఇక తన కొడుకు విషయంలో కూడా రామ్ చరణ్ చాలా స్ట్రిక్ట్ గానే ఉంటారట.
రామ్ చరణ్ కాస్త శరీర బరువు పెరిగినట్టు అనిపించిన ఏంటి ఈమధ్య జిమ్ చేయడం తగ్గించావా అంటూ అందరి ముందు కూడా రామ్ చరణ్ ను తిడతారని ఓ సందర్భంలో చరణ్ తెలిపారు. ఇలా తన కొడుకు ఫిట్నెస్ విషయంలో చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారట ఇక ఒకానొక సమయంలో ఈయన ఒక స్టార్ హీరో వద్దకు ఫిట్నెస్ ట్రైనింగ్ కోసం పంపించారట. ఆయన చేస్తున్నటువంటి కఠినమైన వ్యాయామాలు చూసి చిరంజీవి దగ్గరికి వచ్చిన రామ్ చరణ్ ఇకపై నేను ఆ హీరో వద్దకు వెళ్ళనని తండ్రిని బ్లాక్ మెయిల్ చేశారట. నన్ను కనుక ఫిట్నెస్ విషయంలో అతని వద్దకు పంపిస్తే నేను చస్తాను అంటూ తండ్రినీ బ్లాక్ మెయిల్ చేయడంతో రామ్ చరణ్ విషయంలో చిరంజీవి చేసేదేమీ లేక కొంత కాలం పాటు తానే తనకు ఫిట్నెస్ గురించి అన్ని విషయాలను తెలియజేయడమే కాకుండా ఇంటి వద్దనే ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ను పెట్టి రామ్ చరణ్ కు శిక్షణ ఇప్పించారని తెలుస్తోంది.

ఇలా ఫిట్నెస్ విషయంలో ఎప్పటికప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నటువంటి రామ్ చరణ్ ఇప్పటికీ భారీ స్థాయిలో జిమ్ లో కష్టపడుతూ ఉంటారని తెలుస్తోంది. ఇక రాంచరణ్ సినీ కెరియర్ పరంగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈయన నటించిన rrr సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్  దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: