మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే పెళ్లి సందD , ధమాకా అనే రెండు మూవీ లలో నటించి ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది. ఇకపోతే ఈ రెండు సినిమాలలో తన నటనతో , అందచందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దు గుమ్మ చేతిలో ప్రస్తుతం డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన స్కంద మూవీ ఈ నెల 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. 

ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం అనేక సినిమాలు ఉన్న అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న గుంటూరు కారం , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు మూవీ లు కనుక మంచి విజయాలు సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగులో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తూ ఉండడంతో తేదీలను అడ్జస్ట్ చేయలేక రవితేజ హీరోగా రూపొందబోయే ఓ మూవీని ... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందబోయే ఓ మూవీ నుండి ఈ ముద్దుగుమ్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ ఈ నటి ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా శ్రీ లీల అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న ఆరెంజ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అందుకు తగిన ఆరెంజ్ కలర్ హై హీల్స్ ను ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: