
త్వరలో దర్శకుడు వశిష్ట సెట్స్ పైకి తీసుకు వెళ్ళబోతున్న మూవీలో చిరంజీవి పాత్ర విషయంలో చాల మార్పులు జరిగినటట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి తన వయసు తన ఇమేజ్‌కు తగ్గ పాత్రను చేస్తున్నట్లు స్వయంగా వశిష్ఠ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈమూవీలో హీరోయిన్లు ఉంటారు కానీ పెద్దగా రొమాంటిక్ టచ్ ఉన్న సీన్లు ఉండవని కేవలం ఈమూవీ అంతా ఫాంటసీ మూవీగా ఉంటుందని వశిష్ట లీకులు ఇస్తున్నాడు.
తన చిన్నతనంలో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా తాను అనేకసార్లు చూసి ఎంజాయ్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తాను ప్రస్తుతం చిరంజీవితో తీస్తున్న ఈసినిమాలో అనుష్క తో పాటు మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్న విషయాన్ని బయటపెడుతూ ప్రేక్షకులకు ఒక విజువల్ వండర్ గా పంచభూతాల కాన్సెప్ట్ తో తన మూవీ ఉండబోతున్న విషయాన్ని తెలియచేశాడు.
ప్రస్తుతం చిరంజీవి తన కాలికి జరిగిన సర్జరీ తరువాత పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోతున్నాడు. దీనితో చిరంజీవి పూర్తిగా రికవర్ కావడానికి కనీసం మరో రెండు నెలలు పడుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో ఈమూవీ షూటింగ్ నవంబర్ లో కానీ లేదంటే డిసెంబర్ లో మొదలయ్యే ఆస్కారం ఉనట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు గా జరిగితే ఈమూవీ వచ్చే సంవత్సరం దసరా రేస్ కు విడుదల అయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. ఎప్పటి నుండో చిరంజీవి అభిమానులు తమ హీరోని ఒక ఫాంటసీ మూవీలో నటిస్తే చూడాలని ఆశపడుతున్నారు. దీనితో ఈ మూవీ పై చాల అంచనాలు ఉన్నాయి..