తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి మురగదాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ దర్శకుల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ విజయాలను అందుకున్నాయి. దానితో ఈయన తెలుగు లో కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా రూపొందిన స్టాలిన్ అనే సినిమాను నేరుగా తెలుగు లో రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడి క్రేజ్ తెలుగులో కూడా అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్పైడర్ అనే మరో తెలుగు మూవీ ని కూడా రూపొందించాడు. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్ లో కూడా విడుదల అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఆఖరుగా మురుగాదస్ , రజనీకాంత్ హీరోగా దర్బార్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించలేదు. ఈ మూవీ విడుదల అయ్యి చాలా రోజులు అవుతున్న ఈ దర్శకుడి తదుపరి మూవీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చాలా కాలం పాటు విడుదల కాలేదు.

దానితో మధ్యలో అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చిన అది రూమర్ గానే మిగిలిపోయింది. ఇకపోతే తాజాగా ఈయన తదుపరి మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈయన తన తదుపరి మూవీ ని తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ చేయబోతున్నాడు. ఈ మూవీ ని ఎన్ వి ప్రసాద్ నిర్మించబోతున్నాడు. ఈ మూవీ కి అనిరుధ్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: