క్రేజీ హీరోయిన్ రష్మిక మ్యానియా నెమ్మదిగా మసకబారుతోందా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. నేషనల్ క్రష్ స్థాయికి రష్మిక ఒక్కసారిగా ఎదిగిపోవడంతో ఆమె మ్యానియా కొన్ని సంవత్సరాల పాటు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చాలామంది భావించారు. అయితే జరిగిన వాస్తవాలు వేరు. ఆమె బాలీవుడ్ ఎంట్రీ యిస్తూ నటించిన మొదటి సినిమా ‘గుడ్ బై’ ఫ్లాప్ గా మారింది. ఆమె నటించిన ‘మిషన్ మజ్ను’ కూడ ఫ్లాప్ అయింది.



దీనితో ఆమె రణబీర్ కపూర్ తో నటిస్తున్న ‘యానిమల్’ మూవీ పైనే చాల ఆశలు పెట్టుకుంది. డిసెంబర్ లో విడుదల కాబోతున్న ఈమూవీతో మళ్ళీ తన మ్యానియా ప్రారంభం అవుతుందని రష్మిక భావిస్తోంది. అయితే ఈమూవీ రిజల్ట్ లో ఏమైనా తేడా వస్తే రష్మిక బాలీవుడ్ కెరియర్ మరింత సమస్యలలోకి వెళ్ళే ఆస్కారం ఉంది అని అంటున్నారు. వాస్తవానికి ఈమె నటిస్తున్న ‘పుష్ప 2’ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఈ సీక్వెల్ మూవీలో రష్మిక పాత్ర చాలా తక్కువగా ఉండటమే కాకుండా సినిమా మధ్యలో ఆమె పాత్ర చనిపోతుంది అని కూడ లీకులు వస్తున్నాయి.



ఇలాంటి పరిస్తుతుల మధ్య రష్మిక కోలీవుడ్ ఇండస్ట్రీ పై పెట్టుకున్న ఆశలు కూడ పెద్దగా నెరవేరలేదు అన్న ప్రచారం జరుగుతోంది. ఆమె కోలీవుడ్ లో కార్తీ తో కలిసి నటించిన ‘సుల్తాన్’ ఫ్లాప్ అయితే తమిళ టాప్ హీరో విజయ్ తో నటించిన ‘వారసుడు’ మూవీ కూడ అంతంత మాత్రంగానే సక్సస్ అయింది. దీనితో ఆమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడ చెప్పుకోతగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు అన్న ప్రచారం జరుగుతోంది.



ఇక టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఆమెకు అన్నివిధాల ఎదురీత మొదలైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ తో నటిస్తున్న ‘పుష్ప 2’ తప్ప మరే చెప్పుకోతగ్గ సినిమా ఆమె చేతిలో లేదు. దీనితో ఆమెకు అన్ని విషయాలలోనూ ఎదురీత తప్పడంలేదు అని అంటున్నారు..    


మరింత సమాచారం తెలుసుకోండి: