ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికల హవా అప్పుడే మొదలు కాబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉండగానే ఎలక్షన్స్ బ్యాటరీ సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు.. గతంలో వైయస్సార్ బయోపిక్గా వచ్చిన యాత్ర సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకి సీక్వెల్ గా యాత్ర-2 సినిమాని తెరకెక్కిస్తూ ఉండగా సీఎం జగన్ పాత్రలో తమిళనాడు జీవా కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.ఆ వీడియో అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.


ఏపీ సీఎం వైఎస్ జగన్ పాత్రలో జీవా మెప్పించడం ఖాయమని పలువురు నెటిజన్స్ సైతం తెలియజేస్తున్నారు. జీవ లుక్ ఫర్ఫెక్ట్గా సూట్ అయ్యిందంటూ కూడా నేటిజన్స్ తెలుపుతున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదల అయ్యేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నది. మహీవి రాఘవ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. యాత్ర సినిమా సక్సెస్ సాధించగా యాత్ర-2 పై మంచి హైపు ఏర్పడింది ఇక ఈ సినిమాకి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని పలువు నెటిజెన్స్
 తెలుపుతున్నారు.


యాత్ర-2 చిత్రానికి కాస్త బడ్జెట్ ఎక్కువగా అవుతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవుతుందో లేదో చూడాలి మరి. సంతోష్ నారాయణ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు చిత్ర బృందం. 2024 ఎన్నికలు టార్గెట్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు ఈ సినిమాలో నటీనటుల గురించి ఇంకా తెలియజేయలేదు చిత్ర బృందం.  ఆర్జీవి వ్యూహం పేరుతో రెండు సినిమాలను తెరకెక్కిస్తూ ఉండగా ఈ సినిమాలు కూడా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయి చూడాలి.. ప్రస్తుతం యాత్ర-2 చిత్రానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: