అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ నటి రామ్ పోతినేని హీరోగా రూపొందిన నేను శైలజా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ఈ మూవీ తో మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. దానితో ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కాయి. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ఎన్నో తెలుగు సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇకపోతే ఈ నటి ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ దసరా సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించి మంచి విజయం అందుకుంది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మ ఎన్ని కమర్షియల్ సినిమాల్లో నటించిన కూడా గ్లామర్ షో కు కాస్త దూరంగా ఉంటూ పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటిస్తూ వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా డీసెంట్ అండ్ క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వచ్చేది. 

కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యూటీ సినిమాల్లో కూడా తన స్కిన్ షో పర్సెంటేజీ ని  కాస్త పెంచింది. అలాగే సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోసే విధంగా ఉండే ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే గ్రీన్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: