కొన్ని సినిమాలకు ఎంత ప్రచారం చేసినా కూడా ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు ఏర్పడవు. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఏమీ ప్రచారాలు చేయకుండానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా భారీ అంచనాలను ఏర్పరచుకున్న చిన్న సినిమా మ్యాడ్. ఈ సినిమా పై మొన్నటి వరకు ప్రేక్షకుల్లో పెద్దగా ఎలాంటి అంచనాలు లేవు. కానీ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను ఈ మూవీ బృందం విడుదల చేయగా ... ఆ టీజర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అలాగే ఆ సినిమా లోని టీజర్ లో కొన్ని పంచులు యూత్ ను బాగా ఆకట్టుకోవడంతో ఈ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.

ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. అలాగే ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రచారాలను కూడా ఫుల్ జోష్ లో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించారు.

ఇక ఆ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ మాట్లాడుతూ ... ఈ సినిమా జాతి రత్నాలు సినిమా కంటే ఏ కాస్త తక్కువ తక్కువ నవ్వించింది అని మీకు అనిపించిన నాకు ఏ  సోషల్ మీడియా అకౌంట్ లలో గాని నాకు మెసేజ్ పెట్టినట్లు అయితే వారికి టికెట్ డబ్బులు రిటన్ ఇస్తా అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా నాగ వంశీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: