పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ వివరాలను తెలుసుకుందాం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... హరిష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదు లోని చిలుకూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం పవన్ కళ్యాణ్ పై టెంపుల్ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలబడి ఉన్నాయి.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ ను ఈ మూవీ మేకర్స్ "విడి 13" అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ.లో విజయ్ సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి ఫ్యామిలీ స్టార్ లేదా కుటుంబ రావు అనే టైటిల్ లను ఈ మూవీ బృందం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ రెండు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: