అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా యానిమల్. ఇప్పటికే ఈ సినిమాలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఒకే ఒక్క సినిమాతో దర్శకుడుగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు సందీప్ వంగ.. రాంగోపాల్ వర్మ తర్వాత మొదటి సినిమాతో ఇండస్ట్రీలో ఆ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే 'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండని స్టార్ హీరోని చేశాడు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో సినిమా తీసే అవకాశాన్ని అందుకున్నాడు. 

హిందీలో ఈ డైరెక్టర్ తీసిన అర్జున్ రెడ్డి రీమేక్ 'కబీర్ సింగ్' ను చూసిన కొంతమంది బాలీవుడ్ విశ్లేషకులు సినిమా చాలా వైలెంట్ గా ఉందంటూ కామెంట్స్ కూడా చేశారు. ఈ కామెంట్స్ సందీప్ వరకు వెళ్లడంతో 'కబీర్ సింగ్' ని వైలెంట్ ఫిలిం అంటున్నారు. అసలు వైలెన్స్ అంటే ఏంటో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని చెబుతూ 'యానిమల్' ని మోస్ట్ వైలెంట్ ఫిలింగా తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో రణబీర్ ని ఊర మాస్ లెవెల్లో చూపిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మరింత క్యూరియాసిటీ పెంచేసాయి. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సరికొత్త పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. 

ఇప్పటికే అనిల్ కపూర్, రష్మికల పోస్టర్స్ విడుదల చేసిన సందీప్, లేటెస్ట్ గా 'యానిమల్' విలన్ బాబీ డియోల్ పోస్టర్ ని విడుదల చేశాడు. 'యానిమల్ కా విలన్' అనే క్యాప్షన్ తో పోస్టర్ విడుదల చేయగా, ఈ పోస్టర్లో బాబి డియల్ బ్లడ్ షేడ్ లో మోస్ట్ వైలెంట్ మెన్ గా కనిపిస్తున్నాడు. 'యానిమల్' కి విలన్ అంటే 'యానిమల్' కన్నా భయంకరంగా ఉండాలనుకున్నాడో తెలియదు కానీ మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ పోస్టర్లో బాబీ డియోల్ చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. పోస్టర్ని బట్టి సినిమాలో రణబీర్ - బాబీ డియోల్ మధ్య బీకర పోరు ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: