ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా ఖుషి అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లనే రాబట్టినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ కొన్ని క్రేజీ సినిమాలలో నటిస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. అలా విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు ... ఆ తర్వాత నటించబోయే సినిమాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.

విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ విజయ్ కెరీయర్ లో 12 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను "విడి 12" వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు.

మూవీ తో పాటు విజయ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మృనాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి కూడా చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా విజయ్ కెరియర్ లో 13 వ రోజు మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాను "విడి 13" అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇకపోతే రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే విజయ్ మరో మూవీ ని కూడా సెట్ చేసుకున్నాడు. ఇకపోతే విజయ్ నెక్స్ట్ మూవీ కి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా విజయ్ కెరియర్ లో 14 వ మూవీ గా రూపొందబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: