అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరుతో షాహిద్ కపూర్ నీ హీరోగా పెట్టి భారీ విజయాన్ని అందుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు రణబీర్ కపూర్ ను ఊర మాస్ లుక్కులో చూపించబోతున్నాడు.  ఈ సినిమాపై ఆడియన్స్ లో ఉన్న ఆసక్తి అంతా కాదు. అప్పటిదాకా బార్డర్లు పెట్టుకున్న టాలీవుడ్ కి అర్జున్ రెడ్డి సినిమాతో కల్ట్ ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు ఎటువంటి బార్డర్స్ లేని బాలీవుడ్ లో 'యానిమల్' తో విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ముఖ్యంగా ప్రీ టీజర్ లో మాస్క్ పెట్టుకుని ఉన్న ఒక రౌడీ గ్రూప్ ని గొడ్డలితో నరుకుతూ రక్తపాతం సృష్టించిన తీరు బాలీవుడ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ప్రీటీజరే ఈ రేంజ్ లో ఉంటే ఇంకా టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందోనని రణబీర్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ సైతం 'యానిమల్' టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను తారస్థాయికి చేరుస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా తెలుగు బిజినెస్ పూర్తయినట్లు సమాచారం వినిపిస్తోంది. 'యానిమల్' మూవీ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

 రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపు రూ.15 కోట్లు పెట్టి తెలుగు రైట్స్ ని దిల్ రాజు కొనుగోలు చేశారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హిట్ అవ్వాలంటే రూ.25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. సినిమాపై ఇప్పుడున్న హైప్ చూస్తుంటే ఫస్ట్ వీకెండ్ లోనే ఈ నెంబర్ను బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. పైగా 'అర్జున్ రెడ్డి' తర్వాత సందీప్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ 'యానిమల్' పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇటీవల బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'బ్రహ్మాస్త్ర' సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. వీటన్నింటిని బట్టి చూస్తే 'యానిమల్' తో దిల్ రాజుకి మంచి లాభాలు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: