మోస్ట్ బ్యూటిఫుల్ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎన్నో హిందీ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ నటి హిందీ సినిమా పరిశ్రమ కంటే కూడా సౌత్ సినిమా ఇండస్ట్రీ పై ఎక్కువగా దృష్టిని పెట్టింది. అందులో భాగంగా వరుసగా సౌత్ సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం ఈ నటి ప్రభాస్ హీరోగా రూపొందిన ఏక్ నిరంజన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. 

ఇకపోతే తాజాగా ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా అయినటువంటి చంద్రముఖి 2 లో కీలకమైన పాత్రలో నటించింది. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ మూవీ కి పి వాసు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం కంగనా కు సంబంధించిన ఈ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: