మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈగల్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ , రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ చాలా రోజుల క్రితమే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన తర్వాత కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తుంది.

ఆ కారణంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కానున్న నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతి కి విడుదల కావడం కష్టమే అని వార్తలు వచ్చాయి. దానితో ఈ మూవీ బృందం ఈ సినిమాను కచ్చితంగా వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయబోతున్నాము. ఈ సినిమా షూటింగ్ ఏ మాత్రం లేట్ కావడం లేదు అని అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే తాజాగా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సలార్ సినిమాని ఆ తర్వాత విడుదల వాయిదా వేసి డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దానితో ఆ సమయం లో విడుదలకు రెడీగా ఉన్న సినిమాల్లో చాలా సినిమాలను సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు మూవీ బృందాలు ప్రకటించాయి. 

దానితో ఈగల్ మూవీ ని సంక్రాంతి కి విడుదల చేయడం కష్టమే అని వార్తలు వచ్చాయి. దానితో ఈ మూవీ బృందం మరోసారి ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇక మరోసారి ఈ మూవీ యూనిట్ ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు అధికారికంగా కన్ఫామ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: