టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని ఆఖరుగా నటించిన 5 మూవీ లకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

స్కంద : తాజాగా రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... తమన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా సెప్టెంబర్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాకు 46.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రిన్స్ ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ మూవీ ని తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఇటు రామ్ కి ... అటు బోయపాటి కి మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ది వారియర్ : రామ్ పోతినేని హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా లింగుసామి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 38.10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రెడ్ : రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 14 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈస్మార్ట్ శంకర్ : రామ్ హీరో గా నిధి అగర్వాల్ , నబా నటేష్ హీరోయిన్ లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 20.28 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

హలో గురు ప్రేమ కోసమే : రామ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: