టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే రామ్ తన కెరీర్ లో నటించిన ఆఖరి 4 మూవీ లకు వచ్చిన క్లోసింగ్ గ్రాస్ కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

రామ్ పోతినేని ఆఖరుగా ది వారియర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ... తమిళ దర్శకుడు లింగుసామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ భాషల్లో ఒకే సారి విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కేవలం 37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రామ్ పోతినేని కొంత కాలం క్రితం రెడ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా 35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రామ్ పోతినేని హీరోగా నబా నటేష్ , నిది అగర్వాల్ హీరోయిన్ లుగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ 67 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

రామ్ పోతినేని కొంత కాలం క్రితం హలో గురు ప్రేమ కోసమే అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా 37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా ... త్రినాద్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

ఇకపోతే తాజాగా ఈ యువ నటుడు స్కంద అనే సినిమాలో హీరో గా నటించాడు. మరి ఈ మూవీ తో రామ్ ఏ రేంజ్ గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: