
ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో అఖిల్ ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి ఒక మోస్తారు విజయాన్ని అందుకున్నాడు. ఇలా అఖిల్ కెరియర్ లో చెప్పుకోవడానికి ఈ ఒక్క మూవీ తప్ప. ఏ సినిమా కూడా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు అని చెప్పాలి. ఒకరకంగా అఖిల్ పరిస్థితి చూస్తుంటే ఈయన నెత్తి మీద దరిద్రం తాండవం చేస్తుందని అందరూ అనుకుంటున్న మాట అయితే ఏజెంట్ అనే సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ గా నిలిచింది.
సాధారణంగా డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటిలో తొందరగానే రిలీజ్ అవుతాయి కానీ అఖిల్ సినిమా విడుదలై ఆరు నెలలకు పైగా అవుతుంది. కానీ ఇప్పటివరకు డిజిటల్ మీడియాలో మాత్రం ప్రచారం కాలేదు. అయితే కొన్ని నెలల తర్వాత తిరిగి సోనీ లీవ్ లో ఈనెల 29వ తేదీన విడుదల కావడానికి సిద్ధమైంది అయితే మరోసారి సినిమా వాయిదా పడింది. ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ అనే వ్యక్తిని డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో నిర్మాత అనిల్ సుంకర మోసం చేశాడంటూ గతంలో వివాదం తెరమీదకి వచ్చింది. అయితే ఇప్పుడు ఓటిటి హక్కుల విషయంలో కూడా ఆయన మరోసారి గొడవ చేస్తూ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లారట. దీంతో ఈ విషయంతోనే అటు అఖిల్ ఏజెంట్ మూవీ విడుదల ఆపాలని కోర్టు ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇలా కనీసం ఓటీటి విడుదల విషయంలో కూడా అఖిల్ కు కాస్తయినా అదృష్టం కలిసి రావట్లేదు.