అభిమానుల పట్ల ఎంతో ఉదారత చూపించడంలో
కోలీవుడ్ స్టార్
హీరో సూర్య ముందుంటారు అని చెప్పాలి. ఇటీవల
సూర్య వీరాభిమాని
అరవింద్ రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న సూర్య తాజాగా చెన్నైలోని ఎన్నూరులో ఆ వీరాభిమాని ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు. అరవింద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తూ, అరవింద్ మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా నిలబడడం, ముఖ్యంగా మహిళలకు గౌరవం ఇవ్వడం, చిన్న పిల్లలను, అనాధ పిల్లలను చదివించడం లాంటి మంచి పనులే ఆయన్ని అందరూ అభిమానించేలా చేశాయి. ఒక తమిళ హీరోను తెలుగు ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన పుట్టినరోజు వచ్చిందంటే కటౌట్స్ కట్టి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేస్తూ నానా సందడి చేస్తుంటారు. ఈ ఏడాది సూర్య పుట్టిన రోజున ఆయన కటౌట్స్ పెట్టబోయి ఇద్దరు అభిమానులు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన విషయం తెలిసిందే కదా. అది తెలుసుకొని సూర్య వెంటనే స్పందించి ఆ యువకుల కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి అందరి మన్ననలు అందుకున్నారు. ఇక ఇప్పుడు అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకొని స్వయంగా అతను ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. చెన్నైలోని ఎన్నూరులో నివసించే అరవింద్ అనే యువకుడు సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్ క్లబ్లో కొన్నేళ్లుగా మెంబర్ గా కూడా పనిచేశాడు. దురదృష్టవశాత్తు అరవిన్5 ఇటీవల ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ విషయం తెలియడంతో సూర్య తాజాగా అరవింద్ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులని పరామర్శించారు. అరవింద్ లేని లోటును తాను తీరుస్తానని, వారికి ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తానని ముందుకొచ్చి వాళ్ల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు.