
గతంలో వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్గా చక్రం తిప్పాడు పూరి జగన్నాథ్. కానీ ఆ తర్వాత కాలంలో పూరి జగన్నాథ్ తీసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో పూరి తన సినిమాల తీసే వేగాన్ని తగ్గించాడు అని చెప్పాలి. అయితే పూరి జగన్నాథ్ ఎంతో మంది హీరోలను తన సినిమాలతో మాస్ హీరోలుగా మార్చాడు. అంతేకాదు ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు సైతం ఇండస్ట్రీ హిట్లు ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆయన ఫాస్ట్ గా సినిమాలు చేయడమే మానేశారు. అయితే ఇప్పుడు మళ్లీ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా హిట్ అయింది అంటే పూరి మళ్లీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
అయితే గతంలో విజయ్ దేవరకొండతో లైగర్ అనే సినిమాను తీశాడు పూరి జగన్నాథ్. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక తన స్నేహితురాలు చార్మితో కలిసి తన దగ్గర ఉన్నదంతా కూడా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టాడు. పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొదటి రోజు నుంచి ప్రేక్షకుల్లో నెగిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ మూవీ పూరి కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది అని చెప్పాలి. దీంతో కాస్త జాగ్రత్త పడుతూ మెల్లిగా ఆయన ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలని అనుకుంటున్నాడట పూరి. .