ప్రపంచ వ్యాప్తంగా తన సంగీతంతో అత్యంత గుర్తింపును సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఏ ఆర్ రెహమాన్ ఒకరు. ఈయన తన అద్భుతమైన సంగీతంతో ఇప్పటికే ఎన్నో సినిమాల విజయాల్లో కీలక పాత్రను పోషించాడు. అలాగే ఆస్కార్ అవార్డును కూడా గెలుపొంది ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న రెహమాన్ తన కెరీర్ లో తెలుగు సినిమాలకు మాత్రం చాలా తక్కువ శాతం సంగీతాన్ని అందించాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో రెహమాన్ వరస పెట్టి తెలుగు సినిమాలకు సంగీతం అందించ బోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి.

అందులో భాగంగా మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సన దర్శకత్వం లో రూపొంద బోయే సినిమాకు రెహమాన్ సంగీతం అందించ బోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ విషయాన్ని రెహమాన్ కూడా అధికారికంగా ప్రకటించాడు . దానితో ఈ మూవీ కి రేహమాన్ సంగీతం అందించ బోయే విషయం కన్ఫామ్ అయ్యింది. ఇక ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వం లో రూపొంద బోయే సినిమాకు కూడా రెహమాన్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాక పోతే ఈ సినిమాకు రెహమాన్ ను కాకుండా సంతోష్ నారాయనన్  ను ఈ సినిమా బృందం మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది .

అలాగే ఈ రెండు మూవీ లతో పాటు మరికొన్ని తెలుగు మూవీ లకి కూడా రెహమాన్ సంగీతం అందించ బోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెహమాన్ కేవలం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే తెలుగు మూవీ కి మాత్రమే సంగీతం అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: