కొన్ని సినిమాలకు షూటింగ్ జరుగుతున్న క్రమంలో ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉండవు. కానీ ఆ తర్వాత ఆ సినిమాల నుండి చిత్ర బృందాలు విడుదల చేసిన ప్రచార చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో సినిమా చిత్రీకరణ దశలో ఎలాంటి అంచనాలు లేకుండా ఆ సినిమా ప్రచార చిత్రాలు విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిన సినిమా మ్యాడ్. ఈ మూవీ కి సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం విడుదల చేయగా ఈ టీజర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ ఈవెంట్ ను చిత్ర బృందం నిర్వహించగా ఆ ఈవెంట్ లో ఈ సినిమా నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమా జాతి రత్నాలు మూవీ కంటే ఒక్క శాతం తక్కువ నవ్వించిన ఆ విషయాన్ని మీరు ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా అయిన నాకు తెలియజేస్తే మీకు మీ టికెట్ డబ్బులు వెనక్కు ఇస్తా అని చెప్పడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ప్రీమియర్స్ ను ఏకంగా ఈ మూవీ విడుదలకు మూడు రోజుల ముందే నుండే ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ మరికొన్ని రోజుల్లో ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు నాచురల్ స్టార్ నాని ని ముఖ్య అతిథిగా తీసుకువచ్చే ప్రయత్నాలను ఈ మూవీ బృందం చేస్తున్నట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నాని చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: