హీరోయిన్ పూర్ణ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈ భామ తెలుగు తమిళ మరియు మలయాళీ భాష చిత్రాలలో నటించి మెప్పించింది.ఇక ఈ మధ్యకాలంలో ఈ భామ హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పూర్ణ ఎంతో బిజీగా వున్నారు.. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈ భామ. రీసెంట్ గా పెళ్లి చేసుకొని ఒక కుమారుడికి జన్మనిచ్చి తల్లిగా కూడా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు.ఇక పూర్ణ గర్భవతిగా ఉన్న సమయంలోనే ఈమె నాని హీరోగా నటించిన దసరా సినిమాలో నటించారు. 

ఇక ఈమె ఈ సినిమా విడుదలైన తర్వాత కొడుకుకి జన్మనిచ్చింది.. అయితే గర్భంతోనే పూర్ణసినిమా షూటింగ్లో పాల్గొన్నప్పుడు కాస్త ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె వెల్లడించారు. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ దసరా సినిమాలో తన పాత్రకు ఎక్కువగా రాత్రిపూట చిత్రీకరించే సన్నివేశాల్లే ఉన్నాయని ఆమె తెలిపారు.ఇలా రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల గర్భవతిగా ఉన్న తనకి ఎన్నో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.అంతేకాకుండా రెండు రోజులపాటు వర్షంలో తడుస్తూ చేయాల్సిన సన్నివేశాలు కూడా ఉండటంతో ఆ చల్లని నీళ్లు నాపై పడటం వల్ల నాకు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టిందని ఆమె తెలిపారు. అయితే నా సమస్యలను గుర్తించినటువంటి మేకర్స్ వేడి నీళ్లు పోస్తూ ఈ సినిమా షూటింగ్ చేశారని ఆమె తెలిపారు.

ఇలా ఈ సినిమా షూటింగ్ సమయంలో అంత చలిలో పైగా రాత్రిపూట సినిమా షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డామని అలాగే రోడ్డుపై ఎవరూ లేకుండా ఒంటరిగా కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పరిగెత్తే సన్నివేశం కూడా ఉంది ఆ సమయంలో కూడా తాను మరింత ఇబ్బంది పడ్డానని ఆమె తెలిపారు. ఇలా రాత్రి సమయంలో ఎంతో కష్టపడి నటిస్తే కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారని పూర్ణ తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: