తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రష్మిక మందన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ శౌర్య హీరో గా వెంకి కుడుమల దర్శకత్వం లో రూపొందిన ఛలో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ ముద్దు గుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఛలో మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన గీత గోవిందం సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో ఈ నటి తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ లో విజయ్ , రష్మిక జంటకు కూడా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో డియర్ కామ్రేడ్ మూవీ రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఇకపోతే ఇప్పటికే రెండు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ జోడి మరో సారి ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ మరికొన్ని రోజుల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపంతో సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ విజయ్ కెరియర్ లో 12 వ మూవీ గా రూపొందో పోతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన చిత్ర బృందం రష్మిక ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: