సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ మూవీ ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను మొదట వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 12 వ తేదీనే విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత స్పీడ్ గా జరగడం లేదు అని ... దానితో ఈ మూవీ షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది అని ... ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండడంతో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశం చాలా తక్కువే అని కొన్ని వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా ఈ వార్తలపై ఈ మూవీ మేకర్స్ స్పందించారు.

మూవీ షూటింగ్ ఫుల్ స్పీడు లో జరుగుతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్నీ కూడా మేము అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమాను వచ్చే సంవత్సరం కచ్చితంగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల చేస్తాం అని ప్రకటించారు. ఇలా ఈ మూవీ మేకర్స్ ఈ ప్రకటన విడుదల చేయడంతో మహేష్ బాబు అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: