తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఇప్పటికే తాను నటించిన చాలా సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు ఆఖరుగా తూనీవు అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను తెలుగు లో తెగింపు పేరుతో విడుదల చేయగా ... ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అజిత్ తన తదుపరి మూవీ కి సంబంధించిన అప్డేట్ ను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. అజిత్ మరికొన్ని రోజుల్లో "విడా ముయర్చి" అనే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని త్రిష , అజిత్ సరసన హీరోయిన్ గా కనిపించబోతుంది.  

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ 4 వ తేదీ నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత స్పీడు గా పూర్తి చేయాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై అజిత్ అభిమానులతో పాటు తమిళ సినీ ప్రేమికులు కూడా భారీ లెవెల్లో అంచనాలను పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: