ప్రభాస్ అభిమానులు ఎప్పుడు డెప్పుడా  అని ఎదురు చూస్తున్న ‘స‌లార్’ కొత్త సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన కొద్ది సేపటికే ఆ వార్త మీడియాకు వైరల్ గా మారింది. డిసెంబ‌రు 22న ‘సలార్’ తో పాటు అదేరోజు షారుఖ్ ఖాన్ మూవీ ‘డుంకి’ విడుదల  అవుతున్నప్పటికి ‘సలార్’ నిర్మాతలు దర్శకుడు ఆవిషయం పట్టించుకొకపోవడం వెనుక వ్యూహం ఎవరికి  అర్ధంకాని విషయంగా మారింది’ ‘స‌లార్‌’ ను చూసి ‘డుంకి’ భ‌య‌ప‌డాలే త‌ప్ప‌ ఆ సినిమాను చూసి ప్ర‌భాస్ మూవీ  బెదిరిపోయే ప‌రిస్థితి ఎంత‌మాత్రం లేద‌ని అభిమానులు చేస్తున్న హడావిడితో సోషల్ మీడియా హోరెత్తి పోతోంది.అయితే ఈ రిలీజ్ డేట్ ‘సలార్’ కు ఎంతవరకు అనుకూలం అన్నవిషయం ట్రేడ్ పండిట్స్ కు కూడ అర్ధం కావడంలేదు అని అంటున్నారు. ఇండియాలోనే కాకుండా ‘స‌లార్‌’ కు విదేశాలలో కూడ గట్టిపోటీ ఉండేలా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరాని కాంబినేష‌న్ పై విదేశాలలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక దేశవ్యాప్తంగా మ‌ల్టీప్లెక్సులలో ఈ సినిమా క‌నీసం స‌గం స్క్రీన్స్ తీసుకునే విషయంలో ‘సలార్’ కు ధియేటర్స్ విషయంలో కూడ సమస్యలు తప్పవు.ఇదే క్రిస్మ‌స్ వీకెండ్ లో భారీ అంచనాలు ఉన్న ‘ఆక్వామ‌న్’ కూడ విడుదల అవుతున్న పరిస్థితులలో ఈ మూవీ భారీ స్థాయిలో ఐమాక్స్ స్క్రీన్స్ ను తీసుకునే అవకాశం ఉంది. అయితే యు ఎస్ లో ప్రభాస్ డిస్ట్రిబ్యూటర్లు 1979కి పైగా లొకేషన్లలో ‘సలార్’ కు స్క్రీన్లు లాక్ చేశారు అన్న వార్తలు విని ఒక్కసారిగా ప్రభాస్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు.అయితే ‘సలార్’ విషయంలో ఇంత హడావిడి జరుగుతున్నా ‘డుంకీ’ ప్రొడ్యూసర్లు మాత్రం సైలెంట్ గా ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ‘పఠాన్’ ‘జవాన్’ సినిమాల వరస బ్లాక్ బస్టర్ల హిట్స్ తో దూసుకుపోతున్న షారుఖ్ ఖాన్ మూవీకి ‘సలార్’ చెక్ పెట్టగలిగితే అది దేశవ్యాప్తంగా సంచలనమే అవుతుంది..మరింత సమాచారం తెలుసుకోండి: