‘సలార్’ ఈసారి ఏకంగా షారూఖ్ ఖాన్ మ్యానియాను కూడ లెక్కచేయకుండా క్రిస్మస్ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న పరిస్థితులలో ‘సలార్’ సాహసం పై అనేక చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రశాంత్ నీల్ గతంలో దర్శకత్వం వహించిన ‘ఉగ్రం’ మూవీని యూట్యూబ్ నుండి తొలిగించడంతో మళ్ళీ ‘సలార్’ ‘ఉగ్రం’ సినిమాకు కాపీగా మారుతుందా అంటూ మళ్ళీ ఊహాగానాలు మొదలయ్యాయి.2014వ సంవత్సరంలో విడుదల అయిన ‘ఉగ్రం’ మూవీ అప్పట్లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ మూవీ. అయితే ఆతరువాత ప్రశాంత్ నీల్ ‘కేజీ ఎఫ్’ తీయడంతో అతడి రేంజ్ ఏకంగా పాన్ ఇండియా స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రశాంత నీల్ తీసిన ‘సలార్’ మూవీ కథ గతంలో ప్రశాంత్ నీల్ నుండి వచ్చిన ‘ఉగ్రం’ కథ ఒకేలా ఉంటుందని గత కొంత కాలంగా గాసిప్పులు వస్తూనే ఉన్నాయి.అయితే ఈ వార్తలను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఖండించినప్పటికీ ఏదోఒక అనుమానం కొండర్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ‘సలార్’ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన తరువాత యూట్యూబ్ నుండి ‘ఉగ్రం’ సినిమాను తొలిగించడం వెనుక ప్రశాంత్ నీల్ ఏదైనా వ్యూహాలు అనుసరిస్తున్నాడా అంటూ మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు.ఇప్పటికే ఈసినిమాలో పాటలు అన్నీ బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ గా వస్తూ కథను నడిపిస్తాయి కానీ ప్రభాస్ శృతిహాసన్ లపై ఎటువంటి పాటలు ఉండవు అన్న లీకులు వస్తున్నాయి. దీనితో ఈ ప్రయోగం ఎంతవరకు సగటు ప్రేక్షకుదకి నచ్చుతుంది అన్న సందేహాలు కూడ ఉన్నాయి.  ఇప్పుడు యూట్యూబ్ నుండి ‘ఉగ్రం’ సినిమాను కూడ తొలిగించడంతో ‘సలార్’ విషయంలో ఏదైనా మితిమీరిన ఆత్మవిశ్వాసంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ పొరపాట్లు చేస్తున్నాడా అన్న టెన్షన్ ఈమూవీ బయ్యర్లకు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరస ఫ్లాప్ లతో సత్యమతమైపోతున్న పభాస్ సినిమాల మార్కెట్ కు ‘సలార్’ అత్యంత కీలకంగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..    మరింత సమాచారం తెలుసుకోండి: