నార్త్ అమెరికాలో తెలుగు సినిమాలు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా నార్త్ అమెరికాలో అనేక తెలుగు సమయాలు విడుదల అయ్యాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం నార్త్ అమెరికాలో విడుదల అయిన తెలుగు సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 9 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా రూపొందిన ఆది పురుష్ మూవీ నార్త్ అమెరికాలో 3.18 మిలియన్ కలెక్షన్ లను వసూలు చేసింది. కృతి సనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు.

చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా 2.35 మిలియన్ కలెక్షన్ లాంజ్ వసూలు చేసింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బాబీ దర్శకత్వం వహించాడు.

నాని హీరోగా రూపొందిన దసరా మూవీ 2.05 మిలియన్ కలెక్షన్ లను వసూలు చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు.

విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఖుషి మూవీ కి 1.83 మిలియన్ కలెక్షన్ లు లభించాయి. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శివ నర్వనా దర్శకత్వం వహించాడు.

నవీన్ పోలిశెట్టి , అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు 1.73 మిలియన్ కలెక్షన్ లు లభించాయి.

పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన "బ్రో" సినిమాకు 1.43 మిలియన్ కలెక్షన్ లు లభించాయి.

సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమాకి 1.3 మిలియన్ కలెక్షన్ లు లభించాయి.

బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీకి 1.1 మిలియన్ కలెక్షన్ లు లభించాయి.

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన సామజవరగమన సినిమాకు 1.03 మిలియన్ కలెక్షన్ లు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: