ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ప్లాప్ అవుతుంది అని ఊహించడం మరి కష్టంగా మారిపోయింది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ సాధిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇలాంటి హిట్ సాధించిన సినిమాల్లో కాంతారా కూడా ఒకటి. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ క్లాస్ ప్రేక్షకుల నుంచి మాస్ ప్రేక్షకుల వరకు అందరిని అలరించింది అని చెప్పాలి.


 ఇక భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయింది. ఏకంగా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది సప్తమి గౌడ. ఇక కాంతారా మూవీ హిట్ కావడంతో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో సప్తమి గౌడ గురించి తెలుసుకునేందుకు ఎంతో మంది సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఆమె స్వస్థలం బెంగళూరు చదువు కూడా అక్కడే కొనసాగింది.


 సప్తమి గౌడ కు స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. స్కూల్ కాలేజీ రోజుల్లోనే రాష్ట్ర జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని పథకాలు కూడా సాధించింది. నటన మీద ఆసక్తితో మోడల్గా కెరియర్ మొదలుపెట్టి  కన్నడలో పాప్కాన్ మంకీ టైగర్ సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది. ఈ సినిమాలో నటనకు గాను సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత కాంతారా మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ది వ్యాక్సిన్ వార్,యువ, కాళీ, కాంతారా తదితర సినిమాలతో బిజీగా ఉంది. నితిన్ తమ్ముడు హీరోగా పరిచయం అవుతున్న సినిమాలోను తెలుగు లో అడుగు పెట్టేందుకు సిద్ధమైంది. ఫిట్నెస్ మీద ఎక్కువగా దృష్టి పెట్టే ఈ ముద్దుగుమ్మ శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు ఎక్కువగా వర్కౌట్స్ చేస్తాను అంటే చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: