
ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మంచి కం బ్యాక్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ అనే పాన్ ఇండియా రేంజ్ మూవీ చేసి చేతులు కాల్చుకున్నాడు. అయితే ఇక ఇప్పుడు మళ్లీ తనకు కలిసి వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు అని చెప్పాలి. ఈ సినిమాపై భార్య రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. మొదటి పార్ట్ లో రామ్ బ్రెయిన్ లో ఒక పోలీస్ ఆఫీసర్ చిప్ పెట్టడం.. ఇక రామ్ కూడా పోలీస్ ఆఫీసర్ లాగా మారిపోవడం చూశాం.
అయితే రెండో పార్ట్ లో రామ్ బ్రెయిన్ లో పెట్టిన చిప్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న మరికొన్ని కేసులను కూడా హ్యాండిల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పెద్ద డాన్ కి సంబంధించిన మొత్తం డేటా ని పోలీసులకు పట్టించడానికి పోరాటం చేసే క్యారెక్టర్ లో రామ్ కనిపించబోతున్నాడట ముంబైలో ఉండే ఒక అండర్ వరల్డ్ డాన్ తో రామ్ యుద్ధానికి దిగబోతున్నాడట. వీరిద్దరిలో ఎవరిది పైచేయి అవుతుంది అనే దాని మీద స్టోరీ నడుస్తుందట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడట. మొత్తానికి స్టోరీ మొత్తం ముంబై డాన్ బ్యాక్ డ్రాప్ తోనే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.