నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 400 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రభాస్ నటిస్తున్న ‘కల్కీ 2898’ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో కమలహాసన్ విలన్ గా దీపిక పదుకొనె హీరోయిన్ గా అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీలో నటిస్తున్న నటీనటుల పారితోషికాలకే వందల కోట్లల్లో ఖర్చు పెట్టారనే వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం సమ్మర్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానుల అంచనా.



అయితే దసరా పండుగకు రాబోతున్న బాలీవుడ్ మూవీ ‘గణపత్’ మూల కథ ‘కల్కీ’ మూల కథ ఒకేవిధంగా ఉండే అవకాశం ఉంది అంటూ కొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ‘గణపత్’ మూవీలో హీరో పాత్ర చేస్తున్న టైగర్ ఫ్రా ఫ్ష్ అదేవిధంగా హీరోయిన్ పాత్ర చేస్తున్న కీర్తి సనన్ పాత్రలకు ‘కల్కీ’ లోని ప్రభాస్ డీపీకల పాత్రలను పోలీ భవిష్యత్ కాలానికి సంబంధించిన పాత్రలుగా ఆ భవిష్యత్ కాలంలో ఉపయోగించే ఆయుధాలను ఈమూవీలో ఉపయోగించడంతో ఇంచుమించు సమ్మర్ లో విడుదల కాబోతున్న ‘కల్కీ’ మూవీని ముందుగానే చూసిన ఫీలింగ్ ‘గణపత్’ మూవీని చూసిన వారికి కలుగుతుంది అంటూ ఈమూవీ ట్రైలర్ ను ఇప్పటికే చూసిన వారు అభిప్రాయ పడుతున్నారు.



దీనికితోడు ‘గణపత్’ మూవీలో కూడా అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న పరిస్థితులలో ఇలాంటి సందేహాలు మరింత పెరిగిపోయాయి. భవిష్యత్ కాలానికి సంబంధించిన సినిమాలకు గతంలో ప్రేక్షకుల నుండి ఆదరణ వచ్చిన సందర్భాలు చాల ఉన్నాయి. సింగీతం శ్రీనివాసరావు బాలకృష్ణతో తీసిన ‘ఆదిత్య 369’ తెలుగు సినిమాలకు సంబంధించి ఒక క్లాసిక్ గా పరిగణిస్తారు.



ఇలాంటి పరిస్థితులలో భారీ బడ్జెట్ తో తీస్తున్న ‘కల్కీ’ మూవీ కథ దసరా కు విడుదలకాబోతున్న ‘గణపత్’ మూవీ ద్వారా ముందుగానే ప్రేక్షకులకు తెలిసిపోతే ప్రభాస్ ‘కల్కీ’ పై ఏర్పడిన మ్యానియా తగ్గిపోయే ఆస్కారం ఉంది అంటూ కొందరు ప్రభాస్ అభిమానులు టెన్షన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: