ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట తో సోషియో ఫాంటసీ చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. టైటిల్ పోస్టర్ తో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ముఖ్యంగా పంచభూతాలను ఏకం చేసే ఒక కాలచక్రానికి సంబంధించి పోస్టర్ని సైతం చిరంజీవి బర్త్డే సందర్భంగా విడుదల చేయడం జరిగింది. దీంతో ఇక మీదట చిరంజీవి రీమిక్స్ సినిమాలకు దూరంగానే ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవి చిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు సమాచారం.


డైరెక్టర్ వశిష్ట తో సినిమా అయిపోయిన వెంటనే సోగ్గాడే చిన్నినాయన సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ తో ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .అదేమిటంటే గడిచిన కొన్ని నెలల క్రితం డైరెక్టర్ బోయపాటి శ్రీను, చిరంజీవి కి ఒక సినిమా స్టోరీని చెప్పారట అది బాగా నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేయమని చిరంజీవి చెప్పినట్లు సమాచారం.

 
బోయపాటి ఫుల్ స్క్రిప్ట్ చెప్పిన తర్వాత చిరంజీవికి నచ్చితే ఈ సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. రీసెంట్గా బోయపాటి శ్రీను రామ్ తో కలిసి స్కంద సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. సోమవారం వరకు కలెక్షన్స్ పర్వాలేదు అనిపించుకున్న ఆ తర్వాత ఒకసారిగా డ్రాప్ అయ్యాయి. స్కంద సినిమా చూసిన తర్వాత మెగా అభిమానులు బోయపాటితో సినిమా అంటే డౌటే అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏంటన్న విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: