
న్యూ జీలాండ్ లోని అందమైన ప్రకృతి రమణీయ ప్రదేశాలలో ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని త్వరలో ఈమూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన మహాభారతానికి దర్శకత్వం వహించిన ముకేష్ కుమార్ సింగ్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కు అవసరమైన కాస్ట్యూమ్స్ మరియు పరికరాలను నాలుగు కంటైనర్స్ లో న్యూజిలాండ్ కు షిప్ లో పంపించారు అన్న వార్తలు వస్తున్నాయి.
ఈమూవీలో ఎవరు ఊహించని విధంగా శివుడు పాత్రలో ప్రభాస్ పార్వతిగా నయనతార నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ ప్రాజెక్ట్ లోకి మోహన్ లాల్ కూడ ఎంట్రీ ఇవ్వడం షాకింగ్ గా మారింది. అయితే మోహన్ లాల్ ఏపాత్రలో నటిస్తున్నాడు అన్న విషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. పరుచూరి గోపాల కృష్ణ బుర్రా సాయిమాధవ్ తోట ప్రసాద్ సంయుక్తంగా మూడు సంవత్సరాలు పరిశోధన చేసి ఈమూవీ స్క్రిప్ట్ ను తయారు చేయడంలో మోహన్ బాబు కీలక సూచనలు చేశాడు అన్న వార్తలు వచ్చాయి.
మణిశర్మ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ పాటల ట్యూన్స్ సిటింగ్ ప్రస్తుతం జరుగుతున్నట్లు టాక్. ఏది ఎలా ఉన్నా మంచు విష్ణు సాహసం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది..