
వాస్తవానికి బోయపాటి మొదటి సినిమా ‘బద్ర’ మూవీతో సక్సస్ ఫుల్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఆతరువాత బాలకృష్ణతో తీసిన ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ బ్లాక్ బష్టర్ హ్యాట్రిక్ ను సొంతం చేసుకోవడంతో పాటు మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ తో తీసిన ‘సరైనోడు’ హిట్ అవ్వడంతో బోయపాటి ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్టులో చెరిపోయాడు.
అయితే అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న బోయపాటి రామ్ తో ‘స్కంద’ లాంటి పాత చింతకాయ పచ్చడి సినిమాను ఎందుకు తీశాడు అంటూ రామ్ అభిమానులు కూడ షాక్ అవుతున్నారు. ఈసినిమా మొత్తం మితిమీరిన ఫైట్స్ తల తోక లేని కథ ఈమూవీలో ఉండటంతో వరసపెట్టి సెలవులతో లాంగ్ వీకెండ్ ఉన్నప్పటికీ ఈమూవీకి కనీసపు కలక్షన్స్ కూడ రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
ఈమూవీకి 40 కోట్ల స్థాయిలో ధియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈమూవీకి వచ్చిన డల్ టాక్ తో 20 కోట్ల నెట్ కలక్షన్స్ వస్తే అది ఒక సంచలనమే అంటున్నారు. వాస్తవానికి తమిళ హీరో సూర్య అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ఇప్పుడు ‘స్కంద’ కు వచ్చిన ఘోరమైన ఫలితంతో సూర్య ఇప్పట్లో బోయపాటికి తన డేట్స్ ఇవ్వకపోవచ్చు అన్న ఊహాగానాలు ఉన్నాయి..