పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అందరికీ ఎవర్ గ్రీన్ గా మారిపోయిన మూవీ సుస్వాగతం. అప్పట్లో ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన దేవయాని హీరోయిన్గా నటించింది. పవన్ కళ్యాణ్ ప్రేమను తిరస్కరించే సంధ్య పాత్రలో ప్రేక్షకులను అలరించింది అని చెప్పాలి. ముంబైకి చెందిన దేవయాని మొదట్లో బాలీవుడ్లో కోయల్ అనే సినిమాలో నటించింది. అయితే ఆ సినిమా రిలీజ్ కి మాత్రం నోచుకోలేదు.


 ఇక ఆ తర్వాత తమిళం మలయాళం సినిమాల్లో నటించింది. ముఖ్యంగా కోలీవుడ్లో అజిత్ శరత్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సుస్వాగతం సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులు హృదయాల్లో చోటు సంపాదించుకుంది ఈ హీరోయిన్   ఇక ఆ తర్వాత శ్రీకాంత్తో మాణిక్యం, జగపతిబాబుతో శ్రీమతి వెళ్ళొస్తా, బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ హిట్లను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ అరవింద సమేత లాంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించింది.


 అయితే ఇప్పుడు నటనకు గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఉద్యోగం చేస్తుంది అన్నది తెలుస్తుంది. తమిళనాడులోని స్థానిక అన్నాసలైలో గల చర్చ్ పార్క్ కాన్వెంట్ లో స్కూల్ టీచర్ గా పని చేస్తుంది.  ఆమె పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు. కాగా సినిమాల ద్వారా బాగానే సంపాదించిన దేవయాని ఒకానొక సమయంలో అప్పుల్లో కూరుకుపోయింది. దీనికి కారణం ఆమె ప్రేమ వివాహం చేసుకోవడమె. అలాంటి సమయంలో బుల్లితెరపై అడుగుపెట్టడంతో ఇక పరిస్థితి కాస్త గాడిన పడిందట. ఇక కొన్ని రోజుల తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. ఆమె భర్త డైరెక్షన్లోనే కొన్ని సినిమాలను నిర్మించింది. దురదృష్టవశాత్తు అవన్నీ నిరాశపరిచాయ్  చివరికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి  ఉపాధ్యాయురాలిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: