రామ్ పోతినేని తాజాగా స్కంద అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. శ్రీ లీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... సాయి మంజ్రేకర్ , శ్రీకాంత్ , ప్రిన్స్మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయిన నాలుగవ రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

అలాగే ఈ మూవీ ఇప్పటి వరకు తెలుగు సినిమాలు నుండి విడుదల అయిన మీడియం రేంజ్ హీరోలలో 4 వ రోజు రాబట్టిన కలెక్షన్ ల విషయంలో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఇకపోతే నాని హీరోగా రూపొందిన దసరా సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.72 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలవగా ... నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ కే వీ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు మూవీ 5.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి రెండవ స్థానంలోనూ ... రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ 4.81 కోట్ల కలెక్షన్ లతో మూడవ స్థానంలోనూ , ఇక తాజాగా రామ్ హీరోగా రూపొందిన స్కంద సినిమా విడుదల అయిన నాలుగో రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.46 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి 4 వ స్థానంలో నిలిచింది.

ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం కూడా మంచి డీసెంట్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కష్టాలను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: