తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తరువాత వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాల్లో హీరోగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటుడు తన కెరీర్ లో కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించి దర్శకుడు గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తన కెరీర్ లో మొట్ట మొదటి సారి పలకనామ దాస్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు.

అలాగే ఈ సినిమాలో హీరోగా కూడా నటించాడు. ఈ మూవీ కి పర్వాలేదు అనే రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత డైరెక్షన్ కి కాస్త గ్యాప్ తీసుకున్న ఈ నటుడు మళ్లీ దాస్ కా దమ్కీ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాలో కూడా విశ్వక్ హీరోగా నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో విశ్వక్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

ఆ తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని జీ సినిమాలు చానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు జీ సంస్థ తాజాగా ప్రకటించింది. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: