కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరొకవైపు స్టార్ హీరోల సినిమాలలో విలన్ గా చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుఖాన్ నటించిన జవాన్ సినిమాలో సైతం విలన్ గా నటించారు.  నిడివి తో సంబంధం లేకుండా పాత్ర నచ్చితే స్టార్ డమ్ ని పక్కనపెట్టి నటించే అతి కొద్దిమంది నటుల్లో విజయ్ సేతుపతి ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ సెట్స్ పైనే ఉండడం విశేషం. వీటిల్లో బాలీవుడ్ లో విజయ్ సేతుపతి నటిస్తున్న మూవీ 'మేరీ క్రిస్మస్'(Merry Christamas). ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కు మంచి స్పందన లభించింది.

 ఇందులో విజయసేతుపతి సరసన మొదటిసారి కత్రినా కైఫ్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటించింది. బాలీవుడ్లో 'బద్లాపూర్', 'అందాదున్' వంటి హిట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ డేట్ ను కాస్త ముందుకు జరిపారు. దాని ప్రకారం మేరీ క్రిస్మస్ ని డిసెంబర్ 15 కంటే ఓ వారం ముందుగానే అంటే అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 8న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 

మొదట అనుకున్న డేట్ కి కాకుండా అక్టోబర్ 8కి సినిమాను రిలీజ్ చేయడానికి కారణం అదే నెలలో బాలీవుడ్ టాలీవుడ్ నుంచి బడా సినిమాల రిలీజ్ లు ఉండడమే. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, 'మేరీ క్రిస్మస్' ను డిసెంబర్ 15న రిలీజ్ చేయాలని అనుకున్న మాట వాస్తవం. కానీ వారం తర్వాత అంటే డిసెంబర్ 22న బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటించిన 'డుంకి' సినిమాతో పాటు టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన 'సలార్' సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ రెండూ పెద్ద సినిమాలు కావడంతో 'మేరీ క్రిస్మస్' కి థియేటర్స్ లో కోతపడుతుందని భావించి చిత్ర యూనిట్ ఓ వారం ముందుగానే రావాలని నిర్ణయం తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: