నాచురల్ స్టార్ నాని , వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో మరి కొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి ధానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే వివేక్ అత్రేయ ఇప్పటి వరకు తన కెరియర్ లో ఏ యాక్షన్ మూవీ కి దర్శకత్వం వహించలేదు. అలాంటి దర్శకుడు నాని తో యాక్షన్ మూవీ రూపొందించనున్న నేపథ్యంలో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అర్పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ మూవీ దర్శకుడు వివేక్ ఆత్రేయ , నాని తో నిర్మించబోయే సినిమా కోసం ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ముందుగా టెక్స్ట్ షూట్ చేసి ఎలా వస్తుందో చూసి దానిని బట్టి యాక్షన్ సన్నివేశాలను ఏ రకంగా కొరియోగ్రఫీ చేసుకోవాలి అనే దాని గురించి ప్రణాళికలను వేసుకోవాలని ఉద్దేశంతో తాజాగా ఓ భారీ యాక్షన్ బ్లాక్ ను టెస్ట్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ దర్శకుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అనేక విషయాలను ఈ మూవీ బృందం మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే కొంత కాలం క్రితమే నాని , వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: