కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ నటించిన లియో సినిమాను ఈ దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అయితే విజయ్‌ సినిమా అంటే కేవలం తమిళం వరకే క్రేజ్ ఉంటుంది.కానీ లియో సినిమా విషయం లో మాత్రం అలా కాదు. మొత్తం పాన్ ఇండియా రేంజ్‌ లో లియో సినిమా కి మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది.అయితే అందుకు కారణం విజయ్ మాత్రం కాదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా రూపొందడమే అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న లియో సినిమా విడుదల కాకుండానే రికార్డుల వేట మొదలు పెట్టింది. ఈ సినిమా తమిళనాడులో ఏకంగా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. అలాగే ఈ సినిమాను తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. కానీ అదే సమయం లో నందమూరి బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా కూడా విడుదల అవ్వబోతుంది. ఇంకా రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమా కూడా రిలీజ్ అవుతుంది.


ఈ రెండు సినిమాలకి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. లియో సినిమా ఆ బజ్ ని డామినేట్‌ చేసి జనాల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లో సఫలం అవుతుందా లేదా అంటే డౌటే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.లియో సినిమా ను తెలుగు లో ఏకంగా పాతిక కోట్ల కు అమ్మాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఒక వేళ పాతిక కోట్లకు లియో సినిమా తెలుగు హక్కులు అమ్ముడు పోకుంటే నిర్మాతలు స్వయంగా తెలుగు లో డబ్‌ చేసి విడుదల చేయాలని కూడా భావిస్తున్నారట.ఇక కానీ లియో సినిమా కి గట్టి పోటి ఉన్న కారణంగా సొంతంగా విడుదల చేస్తే థియేటర్ల సమస్య వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లియో సినిమా తెలుగు రైట్స్ విషయం లో చాలా గందరగోళం నెలకొంది అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం బాగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: