ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా దేవర.ఈ సినిమా పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతుంది.ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత తారక్ నటిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే చాలా భారీ అంచనాలు నెలకొన్నాయి. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తర్వాత తారక్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమా ఇది.పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ మూవీలో కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. ఇంకా అలాగే ఆదిపురుష్ తో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ .. మరోసారి దేవర మూవీతో దక్షిణాదిలో సందడి చేయబోతున్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ.ఇక ఆ వీడియోలో కొరటాల శివ మాట్లాడుతూ.. 'దేవర కథ విషయంలో ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తోపాటు మేమంతా ఉద్వేగానికి గురయ్యాం. ఎందుకంటే కొత్త ప్రపంచాన్ని మేం పరిచయం చేస్తున్నాం. ఇందులో చాలా బలమైన పాత్రలు చాలా ఉన్నాయి. చాలా ఉత్సాహంగా షూటింగ్ ప్రారంభించిన తర్వాత ఆ ప్రపంచం మరింత పెద్దదైపోయింది.


కొన్ని షెడ్యూల్స్ ఇంకా షూటింగ్ ఔట్ పుట్ తో మాలో మరింత రెట్టింపు ఉత్సాహం కలిగింది. ఈ మూవీలో ఒక్క డైలాగ్, ఒక్క సీన్ కూడా తీసేయ్యలేము. అందుకే ఒక్క భాగంలో ఇంత పెద్ద కథను ముగించేయడం తప్పు అనిపించింది. అందుకే పాత్రలు ఇంకా వాటి భావోద్వేగాలను పూర్తిస్థాయిలో చూపించాలంటే ఒక్క పార్ట్ లో కుదురదనుకున్నాను. అందరితో కూడా చర్చించి పార్ట్ 2 నిర్ణయం తీసుకున్నాను ' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతుండగా.. తారక్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇప్పటి దాకా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తారక్.. ఇలా ఓ మూవీకి సీక్వెల్ చేయడం ఇదే తొలిసారి. ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఇంకా పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో తారక్ మాస్ హీరోగా కనిపించనున్నారు. ఇంకా అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ డీగ్లామర్ లుక్ లో కనిపించనుంది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: