బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. మొదట తెలుగులో డబ్బింగ్ చేయబడిన సీరియల్ నాగిని సీరియల్ ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా వెండితెర పైన ఎంట్రీ ఇచ్చి తన ఆంద చెందాలతో అందరిని తన వైపు తిప్పుకుంది ఈ ముద్దుగుమ్మ. స్పెషల్ అపీరియన్స్ తో వెండితెర పైన అడుగుపెట్టి తన అందంతో డాన్స్ తో కుర్రకారులను మతిపోగొడుతూ ఉంటుంది.. సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా కనిపిస్తున్న మౌని రాయ్ అదిరిపోయే బికినీ అందాలను గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.


తాజాగా మౌని రాయ్ చీర కట్టులో దర్శనమిస్తూ సాంప్రదాయ దుస్తులను కనిపిస్తోంది. మునుపెన్నడు లేనివిధంగా మరింత అందంగా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫోటోలు అభిమానులను ఫిదా అయ్యేలా చేస్తున్నాయి. కలర్ ఫుల్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తున్న మౌనిరై మరింత అందంగా ఈ చీరలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఫోటోలకు పలు రకాల స్టైల్స్ లో స్టిల్స్ ఇస్తూ అందంతో మొదలు పోగొడుతోంది మౌని రాయ్. ట్రెండీ వేరులో అయినా ట్రెడిషనల్ వేర్లో అయిన ఈ అమ్మడి అందం ముందు మరే హీరోయిన్ కూడా దిగదుడుపే అన్నట్టుగా అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది.


బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నది.. గత కొద్ది నెలల క్రితం వివాహ బంధం లోకి అడుగుపెట్టిన మౌని రాయ్ దాంపత్య జీవితంలో కూడా చాలా ఆనందంగా జీవితాన్ని గడిపేస్తోంది. తన ఫ్యాషన్తో ఎప్పుడు అట్రాక్టివ్ గా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ సరికొత్త నయా లుక్ లో మైమరిపిస్తూ కనిపిస్తోంది. ప్రస్తుత ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. త్వరలోనే రాబోయే బ్రహ్మాస్త్ర సీక్వెల్లో కూడా నటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: