సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వారిలో మణిరత్నం కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోయే సినిమాలో తీసిన దర్శకుడిగా మణిరత్నం కి ప్రత్యేకమైన గుర్తింపు. అయితే రీసెంట్ గా పోనియన్ సెల్వం అనే సినిమాలతో మంచి విజయాలను ఖాతాలో వేసుకున్నాడు ఈ లెజెండరీ డైరెక్టర్. ఒకప్పుడు మణిరత్నం సినిమాలు అంటే చాలా ఆలస్యం అయ్యేవి. ఎందుకంటే మేకింగ్ పరంగా ప్రతి విషయంలో కూడా పర్టీక్యులర్ గా ఉండే ఈ డైరెక్టర్.. షూటింగ్ టైంలో ఏ మాత్రం కాంప్రమైజ్  అయ్యేవారు కాదు.


 కానీ పోనియన్ సెల్వన్ సినిమా తర్వాత మాత్రం మణిరత్నం తన తీరునే పూర్తిగా మార్చేశారు అన్నది తెలుస్తుంది. రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా పొనియన్ సెల్వాన్ ను కేవలం 150 రోజుల్లోనే పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. సాదాసీదా రొమాంటిక్ గ్రామాలలో నెలల తరబడి తీసే మణిరత్నం ఇలా భారీ హిస్టారికల్ మూవీ ని ఐదు నెలల్లో పూర్తి చేయడం చూసి అందరూ అవాక్కయ్యారు. అయితే ప్రస్తుతం మణిరత్నం మారుతున్న ట్రెండుకు తగ్గట్లుగానే అప్డేట్ అయినట్లు తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్స్ పనుల్లోనే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పుడు అప్కమింగ్ సినిమాల విషయంలోనూ పొనియన్ సెల్వన్ ఫార్ములానే వాడుతున్నాడట మణిరత్నం.



 పొనియన్ సెల్వాన్  రిలీజ్ అయిన తర్వాత కమల్ హాసన్ తో సినిమా చేయబోతున్నట్లు మణిరత్నం ప్రకటించారు. మూడున్నర దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ వస్తుండడంతో భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. గతంలో నాయకుడు సినిమా కోసం ఈ ఇద్దరు కలిసి పని చేశారు. కాగా కమల్ తో సినిమాను షార్ట్ టైంలోనే పూర్తిచేసేలా మణిరత్నం ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పుడు ప్రస్తుతం కమల్ చేస్తున్న ఇండియన్ 2,  కల్కి సినిమాలు పూర్తయిన తర్వాతే ఇక మణిరత్నం మూవీ పట్టాలేక్కపోతుందట. ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే అన్ని కంప్లీట్ చేయాలని ఒక్కసారి షూటింగ్ స్టార్ట్ అయితే నాలుగు నెలల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట ఈ లెజెండరీ డైరెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి: