
డైరెక్టర్ అనిల్ రావు పూడి మాట్లాడుతూ ఈ సినిమా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అయితే ఇందులో అనిల్ రావు పూడి ఒక రివ్యూవర్ మీద అసహనాన్ని వ్యక్తం చేశారు. ఒక ఫోబియాతో బాధపడుతూ ఆర్మీలో చేరడం లక్ష్యంగా కష్టపడే అమ్మాయిగా శ్రీ లీల పాత్రను ఇందులో చూపించారు.. కానీ ఒక రివ్యూ ఆ పాత్ర నుంచి డాన్సులు ఆశించాడు.. ఈ రివ్యూ రాసిన వ్యక్తి కూడా తనకు తెలుసు అని.. సినిమా చూసి దృష్టి కోణం అంత దారుణంగా ఉందని తెలియజేశారు. ముఖ్యంగా తండ్రి కూతుర్ల ఎమోషనల్ డ్రామాలో శ్రీ లీల నుండి గ్లామర్ డాన్సులు ఆశించడం చాలా అర్దం లేని విషయమని తెలిపారు డైరెక్టర్.
అలాంటి సమయంలో ఒక విలేకర్ మీరు మిస్టేక్ చేశారు శరత్ కుమార్ సినిమాలో జైలర్.కానీ బ్రేకింగ్ న్యూస్ లో సిఐ మరణం అని స్క్రోలింగ్ వేశారు.. ఈ ప్రశ్నకు సమాధానం గా అంత పెద్ద కమర్షియల్ సినిమాలో ఇంత చిన్న మిస్టేక్ గుర్తించడం చాలా గొప్ప విషయమే.. ఈ విషయాన్ని మీరు గుర్తించడం ఒక హ్యాండ్సప్ అంటూ జైలర్ని సీఐ అని న్యూస్ చెప్పడం తప్పే మావల్లే ఈ పొరపాటు జరిగిందని అందుకు క్షమాపణలు కూడా తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలలో భగవంత్ కేసరి సినిమా మొదటిరోజు 13 కోట్లు షేర్ వచ్చినట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి