బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్నాడు. ఇటీవల కిసికా భాయ్ కిసిక జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా సైతం డిజాస్టర్ గా మారింది. దీంతో ఇప్పుడు టైగర్ 3 సినిమాతో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో వచ్చిన 'ఏక్తా టైగర్'(Ektha Tiger) తో ఈ స్పై యూనివర్స్ స్టార్ట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా 'టైగర్ జిందా హై'(Tiger Zinda Hai) భారీ సక్సెస్ అందుకుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలు ఎందుకోడంతో ఈ స్పై సిరీస్ ని కొనసాగిస్తూ ఈ ఏడాది షారుక్ ఖాన్ హీరోగా 'పఠాన్'(Pathaan) ని సైక్షకుల
ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 'పఠాన్' మూవీలో టైగర్ క్యారెక్టర్ ని లాస్ట్ లో రివిల్ చేయడం ద్వారా నెక్స్ట్ 'పఠాన్' వర్సెస్ 'టైగర్' మూవీ ఉండబోతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆదిత్య చోప్రా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో హృతిక్ రోషన్ హీరోగా వార్ మూవీ సైతం రూపొందింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ఇప్పుడు 'వార్ 2'(War 2( మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో హృతిక్ రోషన్ కి పోటీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' లో షారుక్ క్యారెక్టర్ తో పాటు రహృతిక్ రోషన్ రోల్ కూడా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ లో ముగ్గురు రా ఏజెంట్ పాత్రలను కలపడం ద్వారా పఠాన్ యూనివర్స్ కి కొనసాగింపు చూపించబోతున్నారట. దీని వీళ్లు ఎలా కలుపుతారు? నెక్స్ట్ సినిమాకి ఎలా లీడ్ ఇస్తారనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. అంటే టైగర్ 3 లో సల్మాన్ ఖాన్ తో పాటు షారుక్, హృతిక్ రోషన్ ఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయన్నమాట. ఈ న్యూస్ తో టైగర్ 3 పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో బాలీవుడ్ ఆడియన్స్ 'టైగర్ 3' కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి