టాలీవుడ్ డార్లింగ్ గా పిలుచుకునే రెబల్ స్టార్ ప్రభాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అయితే అలాంటి ప్రభాస్ గతంలో ఎఫైర్ల విషయంలో చాలా సార్లు హాట్ టాపిక్ గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ అనుష్కతో డేటింగ్ లో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు కొన్నేళ్ల నుంచి ఇంటర్నెట్ ను ఊపేసాయి.


 అయితే గతంలో కాజల్ అగర్వాల్తో కూడా ప్రభాస్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అచ్చం  ఇలాగే ప్రభాస్ కెరియర్ లో సూపర్ హిట్గా నిలిచిన వర్షం సినిమా సమయంలో కూడా హీరోయిన్ త్రిష తో ప్రభాస్ డీప్ రిలేషన్షిప్ కొనసాగించాడు అంటూ వార్తలు వచ్చాయి. అనివార్య కారణాలవల్ల పెళ్లి చేసుకోవాల్సిన ఈ ఇద్దరు.  బ్రేకప్ అయ్యి విడిపోయారని టాక్ ఇండస్ట్రీని ఊపేస్తుంది. ఇక తర్వాత ఇద్దరు కూడా ఏ సినిమాలో కలిసిన నటించలేదు. కానీ ఇప్పటికీ ప్రేక్షకులకు ప్రభాస్, త్రిష జోడి ఫేవరెట్ గానే కొనసాగుతుంది. కాగా ఇన్నేళ్లకు మళ్లీ ఈ జోడి ఒక సినిమాలో కనిపించబోతుందట.



 ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇక కొన్ని సినిమాలు విడుదలకు కూడా సిద్ధమవుతున్నావు. అయితే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు షూటింగ్ పూర్తయ్యాక.. సందీప్ రెడ్డి వంగతో ఒక సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను ఎంపిక చేశాడట సందీప్ రెడ్డి వంగ  గతంలో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి తెలిసే డైరెక్టర్ ఈ డెసిషన్ తీసుకున్నాడట. మామూలుగానే కాంట్రవర్షల్ కంటెంట్ కి కాస్త ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ కారణంతోనే ఇప్పుడు త్రిషను కూడా సినిమాలోకి సెలెక్ట్ చేశాడు అనేది తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: