బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్  గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ , భాషలలో పాన్ ఇండియా మూవీ గా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ మూవీ ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా హీరో అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా రబ్బీర్ మాట్లాడుతూ ... సందీప్ రెడ్డి తన తర్వాతి సినిమాను ప్రభాస్ తో చేయబోతున్నాడు. ఆ మూవీ లో నేను ఒక చిన్న పాత్ర చేయబోతున్నాను.  ప్రభాస్ హీరోగా సందీప్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం నాకు దక్కడం నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అని రబ్బీర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా యానిమల్ బృందం ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసే రన్ టైమ్ ను లాక్ చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 3 గంటల 21 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: