పుష్ప మూవీ తో పాన్ ఇండియాహీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో  ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం 'యానిమల్'. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్' మూవీలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ అనిల్ కపూర్, బాబి డియోల్ కీలకపాత్రలు పోషించారు.

 ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్ లో రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడింది." ఇది అందరికీ జరుగుతుంది. నా విషయంలో ముందుగా అమితాబచ్చన్ సపోర్ట్ చేశారు. ఆ తర్వాత అందరూ సపోర్ట్ చేశారు. మొదట చూసినప్పుడు బాధ కలిగింది. కానీ ఇది నార్మల్ అయిపోయింది. మొదట్లో భయమేసింది. కానీ చూసి చూసి మేమేం చేయగలం అని అనుకున్నా. పట్టించుకోకూడదు అని అనుకున్నాను. కానీ అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తుంటే అది చూసి ఓకే ఇది నార్మల్ విషయం కాదు రియాక్ట్ అవ్వాలి అని అనుకున్నా" అని తెలిపింది. 

అంతేకాకుండా.." ఇప్పుడు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. దాంతో నేను అందరు అమ్మాయిలకు చెప్పాలనుకుంటున్నా. ఇలాంటివి నార్మల్ కాదు. మీకు జరిగినప్పుడు సైలెంట్ గా ఉండకండి. రియాక్ట్ అవ్వండి. జనాలు సపోర్ట్ చేస్తారు. మనం ఓ మంచి దేశంలో ఉన్నాం" అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందన. దీంతో రష్మిక మందన చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: