
తన కొడుకుని ఎక్కువగా మిస్ అవ్వడం తనకు ఇష్టం లేదని.. అందుకే తనకోసమే హైదరాబాద్ కి వచ్చేసానని ఇప్పుడే ఇక్కడే ఉంటానని ఇక్కడి నుంచి అన్ని షూటింగ్లకు వెళుతూ ఉంటానని తెలియజేసింది కాజల్ అగర్వాల్.. ఆ అబ్బాయిని కూడా ఇక్కడే ఒక ప్లే స్కూల్లో జాయిన్ చేస్తున్నానని కూడా తెలియజేయడం జరిగింది. కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఈమె నటిస్తున్న సత్యభామ సినిమా షూటింగ్లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఇందులో ఈమె ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతోంది. తెలుగులో పోలీస్ అనగానే ఎక్కువగా విజయశాంతి సినిమాలే మనకి గుర్తుకు వస్తూ ఉంటాయి.
కాజల్ కూడా తాను కూడా విజయశాంతి మేడం గురించి విన్నానని ఆమె సినిమాలు కూడా చాలానే చూశానని ఆమె స్ఫూర్తితోనే ఈ సినిమాని చేస్తున్నానని తెలియజేయడం జరిగింది కాజల్ అగర్వాల్.. ఈ చిత్రం ఒప్పుకోవడానికి ఉన్న నేపథ్యం కూడా తెలియజేసింది తాను మేజర్ సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో తనకు చాలా సన్నివేశాలు నచ్చాయని ఆ సినిమా డైరెక్టర్ శశికరణ్ తిక్కతో పనిచేసే బాగుంటుందని అనిపించిందని వెంటనే అతని ఈ కథ పట్టుకుని తన దగ్గరికి వచ్చారని కథ విన్నాక ఓకే చెప్పానని తెలియజేసింది కాజల్ అగర్వాల్. ఇందులో తను చాలా పోరాట సన్నివేశాలలో నటించానని తెలియజేస్తోంది కాజల్ అగర్వాల్.